Bharat Aawaz

పేకాట స్థావరాలపై నిజామాబాద్ పోలీసుల ఉక్కుపాదం 125 కేసులు నమోదు.. 649 మంది అరెస్ట్ రూ.13.07 లక్షల నగదు స్వాధీనం

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
51
Views

నిజామాబాద్: దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని పేకాట, జూదం నిర్వహిస్తున్న వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు నిర్వహించారు.

ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 125 కేసులు నమోదు చేసి, 649 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు.

ఈ దాడుల్లో నిందితుల నుంచి మొత్తం రూ.13,07,380 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పండుగల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.