Bharat Aawaz

ఉత్తమ కార్పొరేటర్‌గా ఏల్పుల రవీందర్ ఎంపిక నవంబర్ 15న న్యూఢిల్లీలో జాతీయ స్థాయిలో అవార్డు ప్రదానం

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
50
Views

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ కార్పొరేటర్ ఏల్పుల రవీందర్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. డివిజన్ ప్రజలకు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన బహుజన సాహితి అకాడమీ నేషనల్ కమిటీ ఆయనను ఉత్తమ కార్పొరేటర్‌గా ఎంపిక చేసింది.మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, 7వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్న రవీందర్ సేవలను గుర్తించి ఈ ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న బహుజన సాహితి అకాడమీ జాతీయ కార్యాలయంలో ఎంపిక పత్రాలను అందజేశారు. నవంబర్ 15, 2026న న్యూఢిల్లీలోని కరోల్ బాగ్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయనకు జాతీయ స్థాయి ఉత్తమ కార్పొరేటర్ అవార్డును ప్రదానం చేయనున్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన 7వ డివిజన్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధనిక, పేద అనే తేడా లేకుండా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. తన గెలుపునకు సహకరించిన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ కార్పొరేటర్ అవార్డుకు ఎంపిక చేసిన బహుజన సాహితి అకాడమీ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు స్ఫూర్తినిస్తుందని ఏల్పుల రవీందర్ పేర్కొన్నారు.