Bharat Aawaz

ఎల్‌నీనో ప్రభావం పేరుతో ఏసంగి పంటలు వేయవద్దనడం సరికాదు : CPI

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
48
Views

లక్షెట్టిపేట: ఎల్‌నీనో ప్రభావం ఉంటుందని, ఏసంగి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులకు సూచించడం సరైన విధానం కాదని CPI రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు విమర్శించారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పంటలు వేయవద్దని చెప్పడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లికి సాగునీరు తీసుకువచ్చి, మంచిర్యాల జిల్లాకు 20 టీఎంసీల నీటిని కేటాయించి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సాగునీటి వనరులను అభివృద్ధి చేసి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రైతులకు నీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఆ బాధ్యతను విస్మరించి ఏసంగి పంటలు వేయవద్దని సూచించడం సిగ్గుచేటని మండిపడ్డారు.లక్షెట్టిపేట మండల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటి సరఫరాను ఈ నెల 7వ తేదీ నుంచి నిలిపివేయకూడదని డిమాండ్ చేశారు. రైతుల పొలాల్లో పంటలు కోతకు వచ్చే వరకు, కనీసం ఈ నెలాఖరు వరకు గూడెం లిఫ్ట్ ద్వారా నిరంతరాయంగా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 10వ తేదీన మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు రైతులు, రైతు సంఘాల నాయకులు, CPI శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో CPI మండల కార్యదర్శి మేదరి దేవవరం, కేతిరెడ్డి రమణరెడ్డి, దుర్గం దేవదాస్, అవునూరి వెంకటేష్, సంతాపూరి మధుకర్, ఆకుల రామన్న, లింగంపల్లి భానుచందర్, కంది సత్తయ్య, మేసు రాము తదితరులు పాల్గొన్నారు.