Bharat Aawaz

కొండలోగాంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి భారీ బైక్ ర్యాలీ

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
148
Views

మందస: పలాస నియోజకవర్గం మందస మండలం కొండలోగాం ప్రాదేశిక పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవర ఈశ్వరి విజయ్ కాంత్‌కు మద్దతుగా బుధవారం కొండలోగాంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థికి స్థానికుల నుంచి మద్దతు లభించింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొండలోగాం ప్రాదేశిక ప్రాంత అభివృద్ధికి సవర ఈశ్వరి విజయ్ కాంత్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.