Bharat Aawaz

నవీపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. వేడి బీటీ బిటుమెన్‌పై కారు పడటంతో వ్యక్తి మృతి

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
86
Views

నిజామాబాద్ జిల్లా: నవీపేటలో శనివారం (అక్టోబర్ 31) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేడి బీటీ బిటుమెన్‌ (తారు) తీసుకెళ్తున్న టిప్పర్‌ కారుపై బోల్తా పడటంతో ఎల్లేటి నవీన్ చంద్రారెడ్డి (47) మృతి చెందారు.

వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయంలో ఆశానగర్ కాలనీ సమీపంలో టిప్పర్‌ కారును ఢీకొని బోల్తా పడింది. దీంతో టిప్పర్‌లోని వేడి బిటుమెన్‌ కారుపై పడింది. వెనుక సీటులో చిక్కుకుపోయిన నవీన్ చంద్రారెడ్డి తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

కారు డ్రైవర్ రాచెర్ల ప్రసాద్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. టిప్పర్‌ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.