0
Comments
98
Views
మంచిర్యాల: భారత ఉక్కు మనిషి, జాతీయ ఐక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంచిర్యాలలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజకిరణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత, ఐక్యత కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆవుల సాగర్, పిట్టల సుధాకర్, మేకల పవన్ కళ్యాణ్, చిప్పకుర్తి రంజిత్, ఎం.డి. మజీద్, భాను ప్రసాద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.