Bharat Aawaz

పటేల్ స్ఫూర్తితో జాతీయ ఐక్యతకు పోలీసుల ప్రతిజ్ఞ.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
138
Views

● బొల్లారం పోలీస్ స్టేషన్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ

అల్వాల్, అక్టోబర్ 31: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్‌లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్‌) కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ M.L.N రాజు పోలీసు సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.

దేశ సమైక్యత, సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించి, అఖండ భారత నిర్మాణానికి బలమైన పునాది వేశారని గుర్తుచేశారు.

పటేల్ చూపిన ఐక్యతా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, జాతీయ ఐక్యత పరిరక్షణకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో బొల్లారం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal