Bharat Aawaz

ఆసిఫాబాద్ మహిళలకు పెరటి కోళ్ల పెంపకంలో శిక్షణ పూర్తి. స్వయం ఉపాధి దిశగా అడుగులు

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
124
Views

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధే లక్ష్యంగా రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

టాటా ట్రస్ట్స్ మరియు పశువైద్య విశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణా తరగతుల్లో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 33 మంది ఎస్సీ, ఎస్టీ మహిళా కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ (CRPs) పాల్గొన్నారు. పెరటి కోళ్ల పెంపకం ద్వారా గ్రామీణ మహిళలు తక్కువ పెట్టుబడితో ఏ విధంగా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చనే అంశంపై శాస్త్రవేత్తలు వీరికి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.

మూడు రోజుల పాటు సాగిన ఈ శిక్షణలో ప్రధానంగా:

• మెరుగైన కోళ్ల పెంపకం పద్ధతులు

• నాణ్యమైన మేత (దానా) తయారీ

• కోళ్లకు సోకే వివిధ రకాల వ్యాధుల నివారణ చర్యలు

• సకాలంలో వేయాల్సిన టీకాల ప్రాధాన్యత

మహిళలకు వీటిపై శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో మరియు ల్యాబ్ ద్వారా సమగ్రమైన అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని, సొంతంగా ఉపాధి మార్గాలను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావచ్చని ఈ సందర్భంగా వక్తలు మరియు శాస్త్రవేత్తలు సూచించారు.