Bharat Aawaz

రోలుగుంట జడ్పిటిసి బరిలో యువనేత స్వర్ణ సత్యం నాయుడుకి బ్రహ్మరథం

Chevvakula Bhaskararao
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
1
Comments
457
Views

 రోలుగుంట మండల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి సంయుక్త అభ్యర్థిగా శ్రీ సుర్ల సత్యం నాయుడు(లేటు) వారసుడిగా అరంగేట్రం చేసిన ఆయన మనవడు సుర్ల సత్యం నాయుడు బరిలో నిలిచి మండల వ్యాప్తంగా దూసుకుపోతున్నారు. M.Tech వరకు చదువుకున్న విద్యావంతుడు, సౌమ్యుడు, సేవా తత్పరుడిగా ఆయనకు మండలంలో మంచి పేరు ఉంది.సుర్ల కుటుంబం రోలుగుంట మండలంలో సుపరిచిత రాజకీయ కుటుంబం. తాత నుంచి వారసత్వంగా వచ్చిన సేవా గుణం, ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం ఆయన సొంతం.చిన్నప్పటి నుంచే ప్రజా సమస్యలపై అవగాహన, విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. విద్యావంతుల కుటుంబానికి చెందిన ఆయన, ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారు.మండలంలోని నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ, ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.రైతులకు సాగునీటి సమస్య లేకుండా కాలువల ఆధునీకరణ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు.ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్య పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు.మహిళా సంఘాలకు రుణ సదుపాయం, స్వయం ఉపాధి శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ. మండలంలో మెరుగైన వైద్య సేవలు, ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ "మన గుర్తు సైకిల్" అంటూ ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు. కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన గెలుపు కోసం శ్రమిస్తున్నారు. విద్యావంతుడైన యువ నాయకుడు రావాలని మండల ప్రజలు కోరుకుంటున్నారని, ఈసారి సుర్ల సత్యం నాయుడు గారి విజయం తథ్యమని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.