Bharat Aawaz

పద్మనాభపురం జంక్షన్‌లో తెగిపడిన విద్యుత్ వైరు.. చెలరేగిన మంటలు

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
478
Views

పద్మనాభపురం జంక్షన్‌లో తెగిపడిన విద్యుత్ వైరు.. చెలరేగిన మంటలు

  1.  తీవ్ర గాలులకు తెగి రోడ్డుపై పడిన విద్యుత్ తీగ
  2.   వాహనదారులను అప్రమత్తం చేసిన దువ్వాడ శ్రీకాంత్, యువకులు
  3.  విద్యుత్ శాఖకు సమాచారం.. తప్పిన పెను ప్రమాదం

పలాస: తీవ్రమైన ఈదురు గాలుల కారణంగా పద్మనాభపురం జంక్షన్‌లో విద్యుత్ వైరు తెగిపడి మంటలు చెలరేగడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సకాలంలో స్థానిక యువకులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వీచిన బలమైన గాలులకు పద్మనాభపురం ప్రధాన జంక్షన్ వద్ద ఉన్న విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగి రోడ్డుపై పడింది. వైరు నేలను తాకగానే పెద్ద ఎత్తున నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ కావడంతో ఆ సమయానికి అటుగా వస్తున్న ప్రయాణికులు, వాహనదారులు భయంతో ఆగిపోయారు.

ప్రమాదాన్ని గమనించిన దువ్వాడ శ్రీకాంత్, స్థానిక యువకులు తక్షణమే స్పందించారు. వైరు తెగిపడిన ప్రాంతం వైపుగా వాహనాలు, పాదచారులు వెళ్లకుండా రోడ్డుకు ఇరువైపులా నిలబడి అందరినీ అప్రమత్తం చేశారు. అనంతరం తక్షణ చర్యల కోసం విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. సకాలంలో స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అడ్డుకున్న దువ్వాడ శ్రీకాంత్ మరియు యువకులను స్థానికులు, వాహనదారులు ప్రత్యేకంగా అభినందించారు.