Bharat Aawaz

ఆర్నబ్ తుఫాను ఎఫెక్ట్: పలాస, శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మాజీ మంత్రి సీదిరి

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
433
Views

ఆర్నబ్ తుఫాను తీవ్రత నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మరియు పలాస నియోజకవర్గ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా ఈ సూచనలు పాటించాలన్నారు:

* అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి.

* పాత భవనాలు, రేకుల ఇళ్లలో ఉన్నవారు వెంటనే పునరావాస కేంద్రాలకు లేదా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి.

* మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు. పడవలు, వలలను సురక్షిత ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలి. సముద్ర తీరానికి వెళ్లవద్దు.

* తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలను తాకవద్దు. కరెంట్ లేని సమయంలో టార్చ్ లైట్లు, క్యాండిల్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.

* తాగునీరు, పొడి ఆహార పదార్థాలు, అత్యవసర మందులు, రేడియో, ఛార్జ్ చేసిన మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉంచుకోవాలి.

* బలమైన గాలులకు చెట్లు, హోర్డింగుల కింద నిలబడవద్దు.

* అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని సంప్రదించాలి.

నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన కోరారు. తుఫాను ప్రమాదం తొలిగే వరకు ప్రజలందరూ ధైర్యంగా ఉంటూ, ప్రభుత్వం మరియు అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించి సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.