● ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ
అల్వాల్, అక్టోబర్ 26:ఓల్డ్ అల్వాల్ ఎక్స్ రోడ్డు వద్ద ఐజీ విగ్రహం సమీపంలో చాలాకాలంగా వాహనదారులు, స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ సమస్య పరిష్కారమైంది.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగడంతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దోలి రమేష్, భాస్కర్ రెడ్డి, లడ్డు, గిరి, పరమేష్, అరుణ్, ప్రేమ్, సురేష్, జావేద్, పవన్, శోభన్, నందిని, అనూ, మహేష్, లింగారెడ్డి, అంజయ్య, అజయ్, మణికంఠ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal