Bharat Aawaz

కనిగిరిలో ఎందుకీ అరాచకం? నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ నేతల వీరంగం - పత్రాలు చించివేత* ?

VALLERU SIMHADRI
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
30
Views

కనిగిరి:* ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పవిత్రమైనవి. ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసుకునే హక్కు ఉంది. కానీ కనిగిరిలో నేడు జరిగిన పరిణామాలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉన్నాయని అందరూ ఆలోచించాలి.

 

వై.ఎస్.ఆర్.సీ.పీ అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు వెళ్తుంటే, అక్కడే కాపు కాసిన టీడీపీ కూటమి నాయకులు అడ్డుతగిలారు. అభ్యర్థుల చేతిలోని నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేశారు.

 

అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు సైతం చోద్యం చూస్తూ, కూటమి నాయకులకు సహకరించిన తీరు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.

 

*డా. దద్దాల నారాయణ యాదవ్, వై.ఎస్.ఆర్.సీ.పీ ఇంచార్జి - కనిగిరి నియోజకవర్గం* మాట్లాడుతూ, "ఇలాంటి అరాచకం గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రజలు గమనిస్తున్నారు, తగిన సమయంలో బుద్ధి చెబుతారు" అని అన్నారు.

 

ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నికలంటే భయం ఎందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.