Bharat Aawaz

జలదంకి మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా కొలకలపూడి భవాని ప్రకటన.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక నిర్ణయం!

VALLERU SIMHADRI
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
4 min read
0
Comments
70
Views

జలదంకి మండలంలో కూటమి విజయమే లక్ష్యం.. అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా!

 

🔸 ఎన్నికల సమరానికి కూటమి శ్రేణులు సిద్ధం కావాలి.. నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం!

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం – జనసేన – బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జలదంకి మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా శ్రీమతి కొలకలపూడి భవాని గారిని ఆయన ప్రకటించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకుంటూ, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

 

జలదంకి మండలంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని, నాయకులు, కార్యకర్తల ఐక్యతే కూటమి విజయానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయం, ఐకమత్యం, సమష్టి కృషితో ముందుకు సాగి జలదంకి మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

 

*ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిక*

 

అనంతరం జలదంకి మండలం చిన్నక్రాక గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు శ్రీ యడ్ల మాల్యాద్రి గారు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు చేపడుతున్న కార్యాచరణ ప్రాధాన్యత సంతరించుకుంది.