Bharat Aawaz

Madanapalle: బి.కొత్తకోట ఎంపీడీవో అబ్దుల్ సుకూర్ బైక్‌పై వెళ్తుండగా కుక్క అడ్డొచ్చి ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలతో ఆయన మదనపల్లె ఆస్పత్రిలో చేరారు.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
89
Views

Madanapalle: ద్విచక్ర వాహనంలో విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి పడడంతో ఎంపీడీవో తీవ్రంగా గాయపడ్డారు. బి.కొత్తకోట ఎంపీడీవోగా పనిచేస్తున్న అబ్దుల్ సుకూర్ (58) విధి నిర్వహణలో భాగంగా మంగళవారం కురబలకోట మండలం అంగళ్లు నుంచి బైక్‌లో వస్తుండగా మగసాలమర్రి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మరన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది.