Bharat Aawaz

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యం: తాళాసు శ్రీపద్మ

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
401
Views

నామినేషన్ దాఖలు చేసిన తాళాసు శ్రీపద్మ; ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి

పలాస:పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని స్పష్టం చేశారు. పార్టీ తరఫున ఘనంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలందరి ఆశీస్సులు, మద్దతు తనకు తప్పక ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

గత రెండున్నరేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను గుర్తించామని, వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. పట్టణంలో మురికి కాలువలు, పారిశుధ్యం వంటి ప్రాథమిక, అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.

 

అక్రమాలు, కబ్జాలపై కఠిన చర్యలు

మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న భూకబ్జాలు, చెరువులు, నీటి కుంటల ఆక్రమణలు, వాటిపై సాగుతున్న వ్యాపారాలపై పార్టీ నాయకులతో కలిసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మద్యం బాటిళ్లపై అధిక ధరల వసూలును అరికడతామని, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు కూడా పార్టీ అధిష్టానంతో కలిసి అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

 

ప్రజలకు నిరంతరం అందుబాటులో

మున్సిపాలిటీ కార్యాలయానికి దూరంగా ఉండి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్న ప్రజల వద్దకే పాలన చేరేలా సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తామని ఆమె వెల్లడించారు. ఒక మహిళగా ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

 

పట్టణంలోని 36 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.