Bharat Aawaz

సింగరేణి కార్మికులకు 40% లాభాల వాటా ఇవ్వాలి

KalyanKumar Katakam
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
162
Views

శ్రీరాంపూర్: 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) నాయకులు డిమాండ్ చేశారు.

కార్మికుల శ్రమతో సింగరేణి సంస్థ భారీ లాభాలను ఆర్జిస్తోందని, అందుకు అనుగుణంగా కార్మికులకు న్యాయమైన వాటా అందించాలని కోరారు. గత సంవత్సరాలతో పోలిస్తే సంస్థ లాభాలు పెరిగిన నేపథ్యంలో ఈసారి 40% వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కార్మికుల డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో TBGKS నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.