Bharat Aawaz

పరిశుభ్రమైన పని ప్రదేశాలతో మెరుగైన వాతావరణం

KalyanKumar Katakam
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
202
Views

పరిశుభ్రమైన పని ప్రదేశాలతో మెరుగైన వాతావరణం

 

శ్రీరాంపూర్‌లో స్పెషల్ క్యాంపెయిన్ 6.0.. ఆర్కే-7, ఆర్కే న్యూటెక్ గనుల్లో శుభ్రత కార్యక్రమాలు

 

శ్రీరాంపూర్: పరిశుభ్రమైన, క్రమబద్ధమైన పని ప్రదేశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపెయిన్ 6.0లో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7, ఆర్కే న్యూటెక్ గనుల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

 

ఈ కార్యక్రమంలో కార్మికులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గని పరిసరాలను శుభ్రం చేశారు. పని ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు, వినియోగంలో లేని వస్తువులను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా, క్రమబద్ధంగా తీర్చిదిద్దారు.

 

ఉద్యోగులకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన, మెరుగైన పని వాతావరణాన్ని కల్పించడమే స్పెషల్ క్యాంపెయిన్ 6.0 ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. పరిశుభ్రతను నిరంతరం కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

 

“పరిశుభ్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం.. ఆరోగ్యకరమైన పని వాతావరణానికి పునాది” అని పేర్కొన్నారు.