Bharat Aawaz

రామంతాపూర్‌లో రోడ్డు పనులు నత్తనడకన.. మూడు నెలలుగా ప్రజలకు తప్పని ఇబ్బందులు రోడ్డు–డ్రైనేజీ పనులతో ట్రాఫిక్ అవస్థలు | పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ ఆలస్యం

Shaik Baba
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
161
Views

హైదరాబాద్, రామంతాపూర్: రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలో రోడ్డు, డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు గత మూడు నెలలుగా కొనసాగుతున్నప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దెబ్బతినడంతో పాటు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా పాఠశాల సమయాల్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. రోడ్డు పనుల కారణంగా విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు ఆలస్యంగా చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.

డ్రైనేజీ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, రోడ్డు పునరుద్ధరణ చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న పనులకు ఇకనైనా గడువు నిర్ణయించి, ప్రజలకు మరియు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజల ప్రశ్న: ఇంకెంతకాలం ఈ అవస్థలు? అధికారులు వెంటనే స్పందించి రోడ్డు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.