Bharat Aawaz

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి.. రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక!

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
156
Views

 

ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన అధికారులు

నదిలో స్నానాలు, చేపల వేట వద్దని ప్రజలకు సూచన

సుంకేసుల డ్యామ్‌కు భారీగా వరద.. సాయంత్రానికి పూర్తిస్థాయికి నీటిమట్టం

గోదావరి నది ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం నాటికి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని, ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వరద పరిస్థితిని ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు.

 

గోదావరి పరీవాహక ప్రాంతాలైన పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నదిలో స్నానాలకు వెళ్లడం, చేపల వేట వంటి పనులు చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద నీరు చేరిన రహదారులపై ప్రయాణాలు చేయవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.