Bharat Aawaz

ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు అప్‌డేట్.. పంపిణీ విధానంలో కీలక మార్పు.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
182
Views

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఎపీ) పరిధిలోని లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ వాటాను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రం యథావిధిగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందజేస్తారు.

 

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే పంపాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు రాష్ట్రంలోని సుమారు 9.34 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వర్తించనుంది. ఉదాహరణకు, నెలకు రూ. 4,000 పింఛన్ పొందుతున్న వృద్ధులకు కేంద్రం వాటా అయిన రూ. 200 వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన రూ. 3,800 మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దే నగదు రూపంలో పంపిణీ చేస్తుంది.