Bharat Aawaz

అయోధ్య రామాలయంలో.. 105 చోరీలు.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
184
Views

● 105 చోరీ ఘటనలు సీసీటీవీలో నమోదు

● నిందితులను గుర్తించిన సిట్

● తుది దశకు చేరిన దర్యాప్తు

● సెప్టెంబర్ 25లోపు ఛార్జ్‌షీట్

అల్వాల్, సెప్టెంబర్ 21: అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక వివరాలను సుప్రీంకోర్టుకు వెల్లడించింది. 

ఆలయంలో విరాళాల చోరీకి సంబంధించిన 105 ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు సిట్ స్టేటస్‌ రిపోర్టులో పేర్కొంది.

సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన నిందితులను గుర్తించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది.

ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు కోర్టుకు సమర్పించిన వివరాల్లో వెల్లడైంది.

సిట్ దర్యాప్తు దాదాపు పూర్తయిందని, సెప్టెంబర్ 25లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. 

తొలి అరెస్టు నుంచి 90 రోజుల గడువు సెప్టెంబర్ 25తో ముగియనున్న నేపథ్యంలో అంతకుముందే ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు వివరించారు.

సీసీటీవీ ఫుటేజీ, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను దర్యాప్తులో పరిశీలించినట్లు సిట్ స్టేటస్‌ రిపోర్టులో పేర్కొంది. ఈ వివరాలను సుప్రీంకోర్టు పరిశీలించింది.

#sidhumaroju

Alwal