Madanapalle: మదనపల్లె ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయిన వ్యక్తికి తక్షణ సాయం అందించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా, పోలీస్ సిబ్బంది.

0
19

మదనపల్లె పట్టణంలోని ఎంఎస్‌ఆర్ సర్కిల్ వద్ద సోమవారం నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడు. గమనించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చాంద్ బాషా, తన డ్రైవర్, వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ సతీశ్‌తో కలిసి వెంటనే స్పందించారు. కిందపడిన వ్యక్తి ముఖంపై నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకువచ్చి, ఎలాంటి ప్రమాదం జరగకుండా పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం అతని పేరు, చిరునామా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపటికి తేరుకున్న వ్యక్తి స్వయంగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా సీఐ చాంద్ బాషా మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించినట్లుగా ప్రమాద పరిస్థితుల్లో ఉన్న వారికి ముందుగా సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మానవత్వంతో స్పందించి ఆ వ్యక్తికి సహాయం చేశామని తెలిపారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
బాధితులకి నిత్యవసర సరుకులు 6 వేలు ఆర్థిక సాయం
*బాధితునికి నిత్యావసర సరుకులు, రూ.6 వేల ఆర్థిక సాయం అందజేత*    *మంగళగిరి:* గత...
By Rajini Kumari 2025-12-29 09:30:46 0 226
Bharat Aawaz
🛡️ Even a Suspect Has Rights – Bombay High Court Upholds Constitutional Protection
In a landmark move that reinforces the spirit of the Indian Constitution, the Bombay High...
By Citizen Rights Council 2025-07-16 12:46:56 0 2K
Andhra Pradesh
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-05 11:47:01 0 254
Telangana
విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలి
గూడూరు జెడ్‌పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన...
By Bheeshman King 2026-07-04 12:34:04 0 828
SURAKSHA
Ex-Telangana Police: Mentors For New Generation Cops
Retired Telangana Police officers ఇప్పుడు young recruits కి mentors గా మారారు. Training academies...
By Kalaga Sailaja 2026-07-03 11:34:59 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com