Madanapalle: రామిరెడ్డి లేఔట్‌లో వినాయక నిమజ్జనం ఘనంగా ముగిసింది. ఏనుగు వాహనంపై శోభాయాత్ర నిర్వహించగా, రూ. 1.85 లక్షలకు లడ్డూను నాయక్ ఉత్సవ కమిటీ దక్కించుకుంది.

0
13

 Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె రామిరెడ్డి లేఔట్‌లోని నాయక్ వీధిలో నాయక్ సూరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఏనుగు వాహనంపై కొలువుదీరిన వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల కోలాహలం నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరకు నాయక్ ఉత్సవ కమిటీ సభ్యులు రూ.1,85,000లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నాయక్ సూరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా భక్తులు, యువత సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జన వేడుకల్లో భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
Chhattisgarh
Narayanpur, Chhattisgarh:Two Women Naxalites Killed in Chhattisgarh Encounter
Two women Naxalites were killed in an encounter with security forces during a late-night...
By Bharat Aawaz 2025-06-26 06:51:13 0 1K
Telangana
తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వెలువోలు చిట్టిబాబు నియామకం
భారతీయ జనతా పార్టీ తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కోదాడ బిజెపి సీనియర్ నాయకులు...
By Nookapangu Manikanta 2026-04-25 10:54:12 0 166
Telangana
మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-09-16 16:52:28 0 325
BMA
Truth Defenders: Press Debunks Fake State Narratives
In an era of fabricated stories and deepfakes, the press serves the public by rigorously...
By JoinBMA 2026-08-20 06:05:10 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com