గంగమ్మ ఒడికి గణనాథులు.. భక్తి పారవశ్యంలో నిమజ్జనాలు.|

0
35

● మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో 11,629 గణనాథులకు జలాధివాసం

● అల్వాల్‌ చెరువులోనే 1,810 విగ్రహాలకు నిమజ్జనం

● మల్కాజిగిరి జోన్‌లో అత్యధికంగా 6,301 విగ్రహాలు

● ప్రధాన శోభాయాత్రలు పూర్తికాకముందే భారీగా నిమజ్జనాలు

అల్వాల్‌, సెప్టెంబర్‌ 20: వినాయక నవరాత్రుల అనంతరం గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిమజ్జనాలతో అల్వాల్‌ చెరువు పరిసరాలు భక్తి సందడితో కళకళలాడుతున్నాయి.

 మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సెప్టెంబర్‌ 14 నుంచి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు 11,629 గణేష్‌ విగ్రహాలకు జలాధివాసం నిర్వహించారు. ఇందులో ఒక్క అల్వాల్‌ చెరువులోనే 1,810 విగ్రహాలు నిమజ్జనం కావడం విశేషం.

కమిషనరేట్‌ పరిధిలోని నిమజ్జనాల వివరాలను పరిశీలిస్తే.. 8,389 విగ్రహాలు మూడు అడుగులలోపు ఎత్తులో ఉండగా, మరో 3,240 విగ్రహాలు మూడు అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి.

జోన్ల వారీగా మల్కాజిగిరి జోన్‌ 6,301 విగ్రహాలతో ముందుండగా, ఎల్‌బీనగర్‌ జోన్‌లో 3,412, ఉప్పల్‌ జోన్‌లో 1,916 విగ్రహాలకు నిమజ్జన ప్రక్రియ పూర్తయింది.

అల్వాల్‌తో పాటు హస్మత్‌పేట్‌ చెరువు కూడా గణనాథుల నిమజ్జనాలకు వేదికగా నిలిచింది. అక్కడ 3,274 విగ్రహాలకు జలాధివాసం కల్పించగా, సరూర్‌నగర్‌ చెరువులో 2,193, కృత్రిమ నిమజ్జన కొలనులో 609 విగ్రహాలను నిమజ్జనం చేశారు.

ఇక ప్రధాన గణేష్‌ నిమజ్జన శోభాయాత్రలు పూర్తికాకపోవడంతో రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ విగ్రహాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే గణనాథులతో నిమజ్జన కేంద్రాల వద్ద భక్తి వాతావరణం కొనసాగుతోంది.

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు  ఆత్మ ...
By Gujile Ramu 2026-04-23 16:05:54 0 252
Telangana
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి వేడుకలకు నిధులు కేటాయించిన : సింగరేణి సంస్థ
మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీ అన్ని ఏరియాలో మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకల నిర్వహణ...
By Avunoori Mahesh 2026-04-07 05:41:47 0 338
Haryana
Haryana Board Flags 100 Underperforming Schools as Class 12 Results Show Stark Disparities
Haryana Board Flags 100 Underperforming Schools as Class 12 Results Show Stark Disparities The...
By BMA ADMIN 2025-05-22 12:06:39 0 2K
Telangana
వి భి జి రామ్ జి ఉద్యోగుల పెన్ డౌన్..
ఇచ్చిన మాట ప్రకారం వీ బి గ్రామ్ ఉద్యోగులకు వెంటనే పే స్కెల్ అమలు చేయాలనీ.గత కొన్ని నెలలుగా...
By Chakrala Sadhanand 2026-08-04 11:50:42 0 429
Telangana
మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ అంతిమ విడ్కోలు
  నిజామాబాద్ కు చెoదిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్...
By Sadaq Sadaq 2026-02-27 00:00:21 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com