మరోసారి యూరప్ పర్యటనకు జగన్.. షరతులతో సీబీఐ కోర్టు అనుమతి.

0
41

 

కుటుంబంతో కలిసిన యూరప్ పర్యటనకు వెళ్లనున్న జగన్

15 రోజుల పర్యటనకు సమ్మతి తెలిపిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు

ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను ఇవ్వాలని కోర్టు ఆదేశం

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన విదేశీ పర్యటనకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుటుంబ సమేతంగా యూరప్‌లోని తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, 15 రోజుల పర్యటనకు సమ్మతి తెలిపింది.

 

 

 

న్యాయస్థానం ఆదేశాల ప్రకారం... అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీల మధ్య 15 రోజుల వ్యవధిలో జగన్ యూరప్‌ పర్యటనను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పర్యటనకు బయల్దేరే ముందు సమగ్ర ప్రయాణ ప్రణాళికను కోర్టుకు, సీబీఐ అధికారులకు సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. విదేశీ పర్యటనలో అందుబాటులో ఉండే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను దర్యాప్తు సంస్థకు తప్పనిసరిగా అందించాలని కోర్టు కీలక షరతులు విధించింది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్...
By Pagadala Venkateswar 2026-04-18 03:51:47 0 128
Andhra Pradesh
గర్భిణీ అని చూడకుండా అదనపు కట్నం కోసం ఇంటి నుంచి గెంటివేశారు.
అదనపు కట్నం తీసుకురావాలని గర్భిణీ అయిన తనను భర్త ఇంట్లో నుంచి గెంటివేశాడని మదనపల్లె జిల్లాకు...
By Pagadala Venkateswar 2026-05-26 06:29:23 0 141
BMA
Voice of the Voiceless: Empowering Rural Citizens
A foundational strength of the media is its ability to elevate the struggles of marginalized...
By JoinBMA 2026-08-21 10:19:50 0 182
Telangana
కడెం నీటివిడుదల పై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట సాగునీటి...
By Avunoori Mahesh 2026-08-08 13:32:22 0 170
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ముగిసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీ లో మంగళవారం నిర్వహించిన స్పెషల్...
By Pagadala Venkateswar 2026-07-15 05:26:07 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com