ఏపీలో కొలువుల జాతర.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.

0
59

 

అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ తో పాటు రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ నిబంధనల మార్పు

ఇప్పటికే ఏపీపీఎస్సీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఏపీ ఫైర్ సర్వీసెస్ (అగ్నిమాపక) శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) ప్రాథమిక ప్రకటనను జారీ చేసింది. అయితే ఈసారి నియామక విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో కేవలం ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌ (PMT) ఆధారంగా మాత్రమే ఈ ఎంపికలు జరగగా, ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌ (PET)తో పాటు రాత పరీక్షను కూడా తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించారు.

 

 

దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి మరియు రాతపరీక్షల విధానంతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ఎస్‌ఎల్‌పీఆర్‌బీ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా 892 ఖాళీలకు, పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడగా... తాజాగా అగ్నిమాపక శాఖలో మరిన్ని పోస్టులు తోడవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
దేవాలయాలు నాగరికతకు అభివృద్ధికి భక్తి పారవశానికి సోపానాలు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
ఈరోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం సరస్వతి పల్లె గ్రామం నాయిని...
By Benguluri Madhubabu 2026-03-08 12:56:55 0 216
Andhra Pradesh
ఘనంగా సీఎం విజయ్ జన్మదిన వేడుకలు
చిత్తూరు ( భారత్ఆవాజ్) చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు...
By Kiran Kumar 2026-06-22 09:13:57 0 254
Telangana
మేడ్చల్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
మెడ్చల్ ఎక్సైజ్: ₹9 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ఇద్దరి అరెస్టు ‎ ‎మెడ్చల్‌లో...
By Ponnala Srinivasrao 2026-03-17 14:43:48 0 271
SURAKSHA
The Vanguard of Justice: An IPS Officer's Journey
Leading with Courage, Integrity, and People-First Policing: In the demanding realm of internal...
By Kalaga Sailaja 2026-07-23 10:17:46 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com