Madanapalle: మదనపల్లెలో విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల ఏర్పాట్లపై బీజేపీ సమన్వయ సమావేశం. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హాజరు.

0
47

 Madanapalle: విశ్వకర్మ జయంతి, మోదీ జన్మదిన వేడుకలకు బీజేపీ సన్నాహాలు!  పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గురువారం ఉదయం 9:30 గంటలకు ఆలయంలో మహా మృత్యుంజయ హోమం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం ప్రదర్శనగా బొంతలవారి సూత్రం వద్దకు చేరుకుని బహిరంగ సభ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో బీసీలు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి సత్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, జిల్లా కార్యదర్శులు బర్నేపల్లి రవికుమార్, జర్మనీ రాజు, పట్టణ అధ్యక్షులు మఠం కిరణ్, మహిళా మోర్చా నాయకురాలు బాలజ్యోతి, విద్యార్థి నాయకులు జబ్బల శ్రీనివాసులు, గోకుల్, రమేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.
మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు...
By Pagadala Venkateswar 2026-01-29 07:42:16 0 220
Telangana
ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల...
By Pindikura Mahesh 2026-05-01 03:37:31 0 470
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో గాయపడి కోలుకుంటున్న సీనియర్ రిపోర్టర్ యుగంధర్‌ను జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు పరామర్శించి భరోసా కల్పించారు.
మదనపల్లె, ఆగస్టు 8: గత నెలలో గాయపడిన సీనియర్ రిపోర్టర్ యుగంధర్ (చిన్న) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
By Pagadala Venkateswar 2026-08-08 11:35:33 0 104
Andhra Pradesh
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పి శ్రీ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్, గారు
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన...
By Chennaiah Kati 2026-02-04 07:06:45 0 395
Andhra Pradesh
యూనిడు ఎస్సీ ఐఏ పి ముగింపు సదస్సు ఘనంగా ప్రారంభం
విజయవాడ నగరపాలక సంస్థ 01-06-2026       *సుస్థిర నగరాల నిర్మాణానికి విజయవాడ...
By Rajini Kumari 2026-06-01 12:25:04 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com