Madanapalle: మదనపల్లెలో తప్పుడు రికార్డులతో భూమి ఆక్రమించారని బాధితుల ఆరోపణ. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి.
Posted 2026-09-15 10:26:28
0
55
Madanapalle: కమ్మపల్లికి చెందిన తమ భూమిని సొంత అన్న ఆర్. తులసి నాయుడు తప్పుడు రికార్డులు సృష్టించి ఆక్రమించుకున్నారని ఆర్. దేవేంద్ర కుమార్, ఆర్. చంద్రశేఖర్, లేట్ రుసేంద్రనాయుడు కుమారుడు శశికుమార్ ఆరోపించారు. తమను ఇబ్బందులకు గురిచేస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని వారు మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు కమ్మపల్లిలోని సర్వే నంబర్ 163/1లో 1.08 ఎకరాల భూమిపై 2002లో న్యాయస్థానం తమకు హక్కులు కల్పించిందన్నారు. అయినప్పటికీ తప్పుడు రికార్డులు సృష్టించి, రాజకీయ అండదండలతో తమ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు, ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని వారు విలేకరుల ద్వారా కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోటరికి అవార్డుల పంట
వివిధ సేవా విభాగల్లోనూ మరో తొమ్మిది అవార్డులు-రోటరీ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా అవార్డుల...
ఇంద్రనగర్ లేబర్ అడ్డా - శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురం డివిజన్ ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద...
Uttarakhand Strengthens Disaster and Climate Resilience
Uttarakhand has intensified its focus on disaster management and climate resilience to address...
నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గుంటూరు నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి...
Manipur Strengthens Sports Development and Excellence
Manipur continues to reinforce its reputation as one of India's leading sporting states by...