గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఆసిఫాబాద్‌లో యువకుడి మానవత్వం

0
156

🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): ఆపదలో ఉన్న ఒక గర్భిణి ప్రాణాలను కాపాడేందుకు ఒక యువకుడు సకాలంలో స్పందించి రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ ఉదార సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే... ఆసిఫాబాద్ మండల పరిధిలోని మాణిక్‌గూడ గ్రామానికి చెందిన చంద్రకళ అనే గర్భిణి మహిళ చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి రీత్యా వైద్యులు అత్యవసరంగా O+ పాజిటివ్ (O Positive) రక్తం కావాలని పేషెంట్ బంధువులకు సూచించారు. బ్లడ్ బ్యాంక్‌లో రక్తం అందుబాటులో లేకపోవడంతో, ఏం చేయాలో పాలుపోని స్థితిలో పేషెంట్ బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఈ క్లిష్ట సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు తమ గ్రామ ఉపసర్పంచ్ అజయ్‌ను సంప్రదించి సహాయం చేయాల్సిందిగా కోరారు. విషయం తెలుసుకున్న ఉపసర్పంచ్ అజయ్ వెంటనే చొరవ తీసుకుని, గ్రామానికి చెందిన గోగుల అరవింద్ అనే యువకుడిని సంప్రదించగా. అతడు రక్తదానం చేసేందుకు వెంటనే ముందుకు వచ్చారు.ఆలస్యం చేయకుండా గోగుల అరవింద్ ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ చేరుకుని గర్భిణి చంద్రకళ ప్రాణాలు కాపాడటం కోసం రక్తదానం చేశారు. సకాలంలో రక్తం అందడంతో గర్భిణి ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. సమయానికి స్పందించి ఒక గర్భిణి ప్రాణాన్ని కాపాడిన యువకుడు గోగుల అరవింద్‌ను, ఇందుకు అండగా నిలిచిన ఉపసర్పంచ్ అజయ్‌ను ఆసుపత్రి వైద్య సిబ్బంది, రోగి బంధువులు మరియు పలువురు గ్రామస్తులు ఘనంగా అభినందించారు.

Search
Categories
Read More
BMA
Credit Redlining: AI Loan Scoring Traps Small Borrowers
Fintech lending apps and commercial banks are replacing traditional credit evaluations with...
By JoinBMA 2026-08-25 07:04:41 0 158
Andhra Pradesh
చట్టపరిధిలోనే బాధితులకు న్యాయం: జిల్లా ఎస్పీ.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Pagadala Venkateswar 2026-04-13 12:35:15 0 193
Andhra Pradesh
మదనపల్లెలో ఉచిత హాకీ శిబిరం: 5-15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురు హాకీ క్లబ్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సహకారంతో సోమవారం...
By Pagadala Venkateswar 2026-05-05 06:25:52 0 140
Gujarat
New Govt Push: Protecting Eco-Sensitive Zones in India
he central government is accelerating the identification of Environmentally Sensitive Areas (ESA)...
By Lokeshwari Panthadi 2026-07-01 06:37:36 0 149
Andhra Pradesh
శాంతి భద్రతల కోసమే ‘పల్లెనిద్ర’ – సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట పోలీసు విభాగం వినూత్న కార్యక్రమానికి...
By Ratna Sekhar 2026-02-19 19:07:49 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com