గణేష్ మండపాల్లో అవగాహన.|

0
107

అల్వాల్, సెప్టెంబర్ 12: రాబోయే వినాయక చతుర్థి వేడుకలను దృష్టిలో ఉంచుకుని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో SHO A. ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణపై సమావేశం జరిగింది.

పండుగ సందర్భంగా భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా వివిధ గణేష్ మండపాల వద్ద డ్రగ్స్ నివారణ, మహిళల భద్రత, సైబర్ మోసాలు, కల్తీ ఆహారం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.

ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. అనంతరం అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వివిధ గణేష్ మండపాల ప్రతినిధులు పాల్గొన్నారు. వినాయక చతుర్థి వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Strengthens Environment and Forest Conservation
Maharashtra is reinforcing its commitment to environmental sustainability and forest conservation...
By Fathima Safa 2026-06-30 09:12:00 0 224
SURAKSHA
"Beyond the Badge: The Unwavering Resolve of SP P. Jagadeesh"
The Sentinel of Anantapur: IPS P. Jagadeesh and His Mission for a Safer Tomorrow Sub Headline:...
By Kalaga Sailaja 2026-07-14 05:02:49 0 223
Telangana
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
By Gujile Ramu 2026-05-27 04:23:07 0 159
Andhra Pradesh
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 10:28:09 0 173
SURAKSHA
ఆర్థిక మోసాలలో రికవరీ: బాధితులకు తిరిగి అందిన సొమ్ము
సైబర్ ఆర్థిక మోసాలకు గురైన బాధితుల డబ్బును తిరిగి రాబట్టడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...
By Kalaga Sailaja 2026-06-24 09:06:28 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com