బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలి నెలవారీ నేర సమీక్షలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

0
310

🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నెలవారీ నేర పరిశీలన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. రానున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, నిల్వలతో పాటు మట్కా, జూదం, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతతో పాటు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. (CCTNS) సాంకేతికతను విరివిగా వాడాలని, సిసి కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్‌పై నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. బ్లూ కోల్ట్స్ పెట్రోలింగ్ పెంచాలని, డయల్-112 అత్యవసర కాల్స్‌కు పోలీసులు తక్షణమే స్పందించాలని ఎస్పీ నితికా పంత్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
    TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు 10-02-2026 Tue 14:16 | Andhra TTD...
By Pagadala Venkateswar 2026-02-10 09:41:18 0 183
Telangana
నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ...
By Sidhu Maroju 2026-01-30 12:03:23 0 398
Andhra Pradesh
రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం విన్నుత ఆలోచన ..
"అన్నవరం  ప్రత్తిపాడు సర్కిల్  కాకినాడ జిల్లా"   కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి...
By BABJI DADALA 2026-01-04 12:45:39 0 402
SURAKSHA
సాగర తీరంలో అలర్ట్: ఏపీ తీరప్రాంత రక్షణ బలగం
సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర మార్గం ద్వారా జరిగే అక్రమ రవాణాను,...
By Kalaga Sailaja 2026-06-25 09:38:14 0 109
Andhra Pradesh
మదనపల్లెలో మామపై అల్లుడు దాడి
మదనపల్లె మండలంలో కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం మామపై అల్లుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది....
By Pagadala Venkateswar 2026-06-16 04:20:28 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com