మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ ఆవరణలో దాడి పై నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మహిళా నేతల ధర్నా.

0
108

నిజామాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్లపై జరిగిన దాడిని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారి ఆధ్వర్యంలో NTR చౌరస్తా ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ మహిళా నాయకులు మరియు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నిలయమైన అసెంబ్లీ ఆవరణలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడి జరగడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

 

మహిళా ఎమ్మెల్యేలపై దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

 

మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలి – ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతుకిరణ్,మాజీ కార్పొరేటర్లు విశాలిని రెడ్డి, సిర్ప సువర్ణ,మంజుల యాదవ్,చింతకాయల అలేఖ్య,గంగ ,సంధ్య తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే ప్రశ్నలు: సర్వేలో అడిగేవి ఇవే.. ముందే సిద్ధంగా ఉండండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏపీ ఏకీకృత కుటుంబ సర్వేను...
By John Baji 2025-12-27 11:19:24 0 231
Lakshdweep
Lakshadweep’s Struggle: Development vs. Tradition
The Union Territory of Lakshadweep is experiencing a period of significant transition and...
By Lokeshwari Panthadi 2026-06-29 05:20:44 0 96
Andhra Pradesh
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల...
By Chennaiah Kati 2026-07-23 10:31:55 0 222
Telangana
కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా! ..బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా!! ‎కాళేశ్వరం...
By Ponnala Srinivasrao 2026-07-10 09:02:22 0 201
Andhra Pradesh
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....  బాపట్ల: 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు...
By Gadiyapudi Narendra 2025-12-27 10:56:27 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com