బలవంతపు వసూళ్లపై డీజీపీ ఉక్కుపాదం.|

0
157

● రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌కు పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు

● శుభకార్యాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై నిఘా

● ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం

ఆల్వాల్, సెప్టెంబర్ 6: ఇళ్ల గృహప్రవేశాలు, పెళ్లిళ్లు తదితర శుభకార్యాల సందర్భంగా కొందరు ట్రాన్స్‌జెండర్లు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ తీవ్రంగా స్పందించారు.

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బలవంతపు వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలోని అన్ని నగరాల పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలోనూ ఇలాంటి వసూళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి సమస్యను నియంత్రించిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు. 

ప్రస్తుతం కూడా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత పోలీసు విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

అయితే బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న కొందరి చర్యలను మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజానికి ఆపాదించకూడదని డీజీపీ స్పష్టం చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారు గౌరవప్రదమైన జీవనం సాగించేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, ప్రతిష్టాత్మకమైన హైడ్రా విభాగంలోనూ పలువురు ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా సమర్థంగా పనిచేస్తున్నారని డీజీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు. 

సమాజంలో గౌరవప్రదమైన జీవనానికి వారు అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏపీ ట్రాఫిక్ విప్లవం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్...
By Kalaga Sailaja 2026-06-25 09:57:31 0 110
Fashion & Beauty
Barrier-First Skincare Captures the Gen Z Market
The skincare community has officially retired aggressive exfoliation routines in favor of total...
By Dunna Jessicaruth 2026-05-19 07:40:26 0 109
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 31న మున్సిపల్ సమావేశం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 31న సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని...
By Kothuru Murali 2026-01-27 09:29:40 0 210
Telangana
నిజామాబాద్.14 సo! వస్తరాల బాలికలకు హె పి వి టికా ఎపించలి DMHO
14 సంవతరాల బాలికలందరికి HPV టికా ఐపించలాని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ సుచించారు.జిల్లా వైద్య...
By Sadaq Sadaq 2026-03-06 18:00:24 1 294
Andhra Pradesh
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త
మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం...
By Eslavath RameshNaik 2026-01-17 15:34:35 0 704
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com