ఆసిఫాబాద్‌లో మిన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు. ఉట్టికొట్టే పోటీలో బాబాపూర్ గ్రామం ఘన విజయం

0
402

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత కోలాహలంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పట్టణంలో భారీ శోభాయాత్రను చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రదర్శించిన సాంప్రదాయ విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

బాబాపూర్ జట్టు కైవసం: శోభాయాత్ర అనంతరం మధ్యాహ్నం నిర్వహించిన ఉట్టికొట్టే (ఉట్ల పండుగ) కార్యక్రమం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోటీలో పలు జట్లు ఉత్సాహంగా పాల్గొనగా. ఎంతో పట్టుదలతో మరియు సమన్వయంతో ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ జట్టు ఉట్టిని కొట్టి ఘన విజయం సాధించింది. విజేతగా నిలిచిన బాబాపూర్ జట్టును నిర్వాహకులు మరియు స్థానికులు ప్రత్యేకంగా అభినందించి అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లోఆకట్టుకున్న పరమేశ్వరుని ఆర్ట్
పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయం ఆవరణంలో ఓ భక్తుడు శనివారం సుమారు...
By Kothuru Murali 2026-02-14 14:49:54 0 215
Andhra Pradesh
గుంటూరు ప్రగతి నగర్ లో కార్డెన్ సెర్చ్.... 28 వాహనాలు సీజ్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో శనివారం ఉదయం పోలీసులు గార్డెన్ సెర్చ్ చేశారు...
By John Baji 2025-12-27 12:10:17 0 235
Telangana
బిల్లుల చెల్లింపుల్లో ముందుండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు
భూపాలపల్లి జిల్లా: శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గృహ నిర్మాణ...
By BURRA KIRANKUMARA 2026-09-15 12:46:05 0 155
Andhra Pradesh
APSRAM స్కూల్ కృష్ణలంక స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కమిషనర్ షమ్మి
సర్కిల్ 3  ఏపీఎస్ఆర్ఎం స్కూల్   కృష్ణలంక      స్వచ్ఛంద...
By Rajini Kumari 2025-12-20 13:38:50 0 227
Sikkim
Sikkim Leads India’s Organic Farming Growth and Innovation
Sikkim continues to strengthen its reputation as India’s first fully organic state, setting...
By Fathima Safa 2026-06-25 08:59:17 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com