Madanapalle: మదనపల్లెలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

0
81

మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన మదనపల్లెలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ గంగారపు రాందాస్ చౌదరి తెలిపారు.

 

ఆయన అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు మిషన్ కాంపౌండ్ నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమై చిత్తూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె మీదుగా శ్రీదేవి గార్డెన్ వరకు కొనసాగనుంది.

 

బైక్ ర్యాలీలో పాల్గొనే వారు ఉదయం 8.30 గంటలకే మిషన్ కాంపౌండ్ వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీదేవి గార్డెన్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొనే లైవ్ కార్యక్రమాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా యువజన విభాగానికి సంబంధించిన ప్రకటన, పవన్ కళ్యాణ్ సందేశం, ఇతర ఆనంద క్షణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు కలిసి వీక్షించనున్నారు.

Search
Categories
Read More
Arunachal Pradesh
Flash Floods Devastate NEEPCO Colony in Keyi Panyor
The ongoing monsoon disaster in Arunachal Pradesh has severely crippled vital energy...
By Lokeshwari Panthadi 2026-07-01 09:24:06 0 162
SURAKSHA
Ila Tripathi IAS: Inspiring Governance Through Excellence
A Young Telangana IAS Officer Driving Inclusive Development, Transparent Administration, and...
By Lokeshwari Panthadi 2026-07-14 11:27:51 0 308
Andhra Pradesh
డోనాల్డ్ ట్రంప్ ను కలిసిన విపక్ష నేత వెనిజులా
డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిసిన వెనెజువెలా విపక్షనేత మరియా మచాడో, తనకు బహూకరించిన...
By Rajini Kumari 2026-01-16 12:40:35 0 233
Telangana
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల వైకల్యం గుర్తింపు శరవేగంగా పూర్తి చేయాలి
నేలకొండపల్లి: విద్యార్థులలో ఉన్న వైకల్యాల గుర్తింపు ప్రక్రియ ను శర వేగంగా పూర్తి చేయాలని...
By Krishna Balina 2026-02-06 10:11:32 0 242
Andhra Pradesh
విద్యా అనేది శక్తివంతమైన ఆయుధం: ఎంఎల్ఏ మిరియాల శిరీషదేవి
ఇంటర్మీడియట్, పదవ తరగతి CBSC ఫలితాల్లో రంపచోడవరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్ధులను...
By Shyamala Yadagiri 2026-04-22 02:58:43 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com