Ramasamudram: రామసముద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్సై హృషికేశవ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పల్లె నిద్ర చేపట్టి భద్రతపై అవగాహన కల్పించారు.
Posted 2026-08-28 05:37:36
0
85
Ramasamudram: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. మండలంలోని మినికి, మాలేనత్తం గ్రామ పంచాయతీలలో గురువారం ఎస్సై హృషికేశవ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై అప్రమత్తత, దొంగతనాల నివారణ తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. అనంతరం రాత్రి వేళల్లో పోలీసులు గ్రామాల్లోనే బస చేసి ప్రజల భద్రతకు భరోసా కల్పించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
8th Pay Commission: Kolkata Outreach and Consultations
In a significant move for government employees, the 8th Pay Commission is set to commence its...
Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్
కిడ్నాపర్లను గంటన్నరలో...
మంచిర్యాల 2 వ డివిజన్ లో గల డంప్ యార్డ్ ని తనిఖీ చేసిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి...
మళ్లీ అవే సమాధానాలు.
మళ్లీ అవే సమాధానాలు
వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల...
పల్లెల్లో ఖాకీల పలకరింపు: గ్రామ దర్శిని సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాదని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. ‘గ్రామ...