పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది: జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన ప్రెస్ మీట్.

0
102

ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాదిక్ అనే వ్యక్తి పెట్టిన చిత్రహింసలు, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడగా, వారిలో 13 ఏళ్ల బాలుడు రియాన్ష్ మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్లెదుటే తన కుటుంబం మొత్తం జలసమాధి అవుతున్న దృశ్యాన్ని చూసిన ఆ చిన్నారి చెప్పిన వాస్తవాలు గుండెలు పిండేస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఉన్న ఘోరమైన కుట్రను, నిందితుడి పైశాచికత్వాన్ని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియా ముందు ఆ బాలుడితో సహా హాజరై వివరించారు.

 

కాకినాడకు చెందిన ప్రముఖ మానేపల్లి జువెలర్స్ కుటుంబానికి చెందిన జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఆయన భార్య, ఆమె తల్లిదండ్రులు.. ఈ నలుగురి మృతికి సాదిక్ అనే వ్యక్తి కారణమని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీవ్రంగా ఆరోపించారు. వారి కుమారుడైన రియాన్ష్ ప్రాణాలతో బయటపడి అసలు నిజాలను వెల్లడించాడని తెలిపారు. రియాన్ష్ కథనం ప్రకారం, షూటింగ్ కోచ్ అయిన సాదిక్.. మొదట తండ్రి జగదీశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నాడు. ముంబై, కెనడా నుంచి ప్రమాదకర రసాయనాలు తెప్పించి, వాటిని ప్రోటీన్ షేక్‌లలో, ఆహారంలో కలిపి ఇచ్చి నెమ్మదిగా ఆయన్ను అనారోగ్యం పాలు చేసి, చివరికి ప్రాణాలు తీశాడని బాలుడు తెలిపాడు. ఈ విషయాన్ని చనిపోయే ముందు తల్లి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని ఎంపీ వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
లోయోలా అకాడమీలో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు.|
    సికింద్రాబాద్ : తెలంగాణ – లోయోలా అకాడమీ 1976లో స్థాపించబడి, శ్రేష్ఠత,...
By Sidhu Maroju 2025-12-20 10:11:54 0 243
Telangana
శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్...
By Sidhu Maroju 2025-11-28 16:11:15 0 253
Telangana
జనప్రియ వద్ద RUB పనులను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్.|
● నిర్మాణ పనుల పురోగతిపై ఆరా ● నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయడంపై దృష్టి ● స్థానికుల...
By Sidhu Maroju 2026-08-18 18:05:44 0 123
Telangana
మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారానికి పోటెత్తిన భక్తులు తెలంగాణ : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా...
By Pinnehasan Odela 2026-01-16 09:12:44 0 335
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com