ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు! కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్

0
180

అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన కుత్బుల్లాపూర్ భూములను వెంటనే తొలగించాలి.

‎సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి: తన్నీరు హరీష్ రావు...

‎22-A బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్

‎కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భూములను అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అర్హులైన భూ యజమానుల భూములను 22-A జాబితా నుంచి తొలగించాలని మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు గారు డిమాండ్ చేశారు.

‎మంగళవారం షాపూర్‌నగర్‌లోని ఎం.జే. గార్డెన్స్‌లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 22-A బాధితుల సమస్యలపై బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి హరీష్ రావు గారు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు గారు, గోరేటి వెంకన్న గారు, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  

‎ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడుతూ.... 

‎🔥“తెలంగాణలో 22-A సమస్య కేవలం రిజిస్ట్రేషన్ సమస్య కాదు.. వేలాది మంది భూ యజమానుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య” అని అన్నారు.

‎🔥 ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బుతో భూములు కొనుగోలు చేసి, చట్టబద్ధమైన పత్రాలు, పట్టాలు కలిగి ఉండి, పన్నులు చెల్లిస్తున్న ప్రజల భూములను ఒక్కసారిగా 22-A జాబితాలో చేర్చడం వల్ల వారు తమ భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్ చేసుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‎“22-A అంటే కేవలం ఒక నంబర్ కాదు.. ఒక కుటుంబం భవిష్యత్తుపై పడే తాళం!”

‎ఒక కుటుంబం తన భూమిని అమ్మి పిల్లల చదువుకు ఖర్చు చేయవచ్చు, కూతురి వివాహం చేయవచ్చు, వ్యాపారం ప్రారంభించవచ్చు, అనారోగ్య సమయంలో వైద్య ఖర్చులు భరించవచ్చు, ఇల్లు నిర్మించుకోవచ్చని హరీష్ రావు గారు పేర్కొన్నారు.

‎“ప్రజల భూములను నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు” అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

‎సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

‎ 22-A అంశంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, తప్పు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని హరీష్ రావు గారు డిమాండ్ చేశారు.

‎ “భూభారతి సాక్షిగా ఈ అక్రమాలు జరుగుతున్నాయి. 2023 డిసెంబర్ నుంచి 22-A జాబితాలో చేర్చిన, తొలగించిన సర్వే నంబర్లపై పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలి” అని ఆయన అన్నారు.

‎ తప్పు చేయలేదని ప్రభుత్వం చెబుతున్నట్లయితే, సంబంధిత శాఖ బాధ్యత వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

‎“రేవంత్ రెడ్డి గారూ.. మీ తప్పు లేకపోతే వెంటనే పొంగులేటిని బర్తరఫ్ చేయండి” అని హరీష్ రావు గారు సవాల్ చేశారు.

‎“మీకు రియల్ ఎస్టేట్ తెలుసు అంటే.. మాకు పోరాటాలు తెలుసు... ప్రజల పక్షాన ఎలా పోరాడాలో మాకు తెలుసు” అని హరీష్ రావు గారు స్పష్టం చేశారు.

‎ 22-A బాధితుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

‎“సెప్టెంబర్ 7వ తేదీలోగా లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తాం. అసెంబ్లీలో కొట్లాడుతాం.. బయట బీఆర్ఎస్ శ్రేణులు పోరాడుతాయి. ప్రజలకు కంటికి రెప్పలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది” అని హరీష్ రావు గారు అన్నారు.

‎“రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యులను గుర్తించి శిక్షిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

“ప్రజల భూములపై కన్నేస్తే సహించేది లేదు..ప్రజల హక్కులను హరిస్తే పోరాటం ఆపేది లేదు!

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పలు కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా నాయకురాల్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ సదుం బిజేపి మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర...
By Kothuru Murali 2026-08-07 13:21:02 0 171
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల లో గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు,...
By Kothuru Murali 2026-02-26 12:53:13 0 182
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి సెల్‌ఫోన్ టార్చ్‌లతో వైద్యం అందించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ ఆగ్రహం.
 మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సెల్‌ఫోన్...
By Pagadala Venkateswar 2026-09-19 06:09:12 0 37
SURAKSHA
Shri Pratyaya Amrit: Transforming Bihar Through Visionary Governance
A distinguished 1991-batch IAS officer of the Bihar cadre, Shri Pratyaya Amrit has become one of...
By Kalaga Sailaja 2026-07-24 09:20:34 0 118
BMA
Exposing Scams: Press Fights Infrastructure Graft
Public interest journalism serves as a vital shield for taxpayer money. Recently, independent...
By JoinBMA 2026-08-20 05:58:09 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com