భద్రాచలం బస్టాండ్‌లో దుర్వాసనల గోస.. పట్టించుకోని అధికారులు!
Posted 2026-08-22 06:15:35
0
203
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఆర్టీసి బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. బస్టాండ్ ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాలికొదిలేయడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది.
బస్టాండ్ పరిసరాల్లో కొందరు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండే ప్రయాణికులు దుర్వాసన భరించలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం, ఉన్న వాటిని కూడా సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది.
ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసి మరియు పంచాయతీ అధికారులు స్పందించి, బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని... బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏదైనా ప్రజలకే- పెద్దపీట: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో...
ప్రయాణికుల సౌకర్యాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి
మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల రైల్వే స్టేషన్ను...
సబ్సిడీ లోన్ పేరిట వల.. లక్షల్లో డీల్, బైక్‌తో పరార్!
- వెల్డింగ్ కార్మికుడికి రూ. 30 వేలు టోకరా.. - గంగారం MPDO ఆఫీస్ అటెండర్‌పై బాధితుడి...
Delhi-NCR Accelerates Metro and Regional Connectivity
Delhi-NCR is witnessing significant progress in metro expansion and regional connectivity...
హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ - అర్ధరాత్రి స్వయంగస్తి.|
హైదరాబాద్ : హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అర్థరాత్రి...