అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు ఆత్రం సుగుణక్క

0
280

🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్:19 ఆగష్టు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఘాటుగా విమర్శించారు. బుధవారం జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావులతో కలిసి డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ్యక్తిగత విమర్శలు మాని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు క్షేత్రస్థాయి వాస్తవాలను మాట్లాడారని ఆమె పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి వెళ్ళిందని మండిపడ్డారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పులను తీర్చుకుంటూనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని మంత్రి ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సుగుణక్క హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
బాచుపల్లి హైడ్రా కూల్చివేతలపై ప్రణీత్ అంటీలియా వాసుల నిరసనలు
మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ప్రణీత్ ఆంటీలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు హైడ్రాపై తీవ్ర...
By Ponnala Srinivasrao 2026-03-13 07:49:30 0 307
Telangana
మంచిర్యాలలో ఘనంగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న జనసేన కో ఆర్డినేటర్స్
మంచిర్యాల: హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమం ఆదివారం...
By Avunoori Mahesh 2026-09-20 05:56:55 0 49
Telangana
"ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ,...
By Sidhu Maroju 2026-04-22 10:25:02 0 341
Telangana
Citizen Rights & Corporate Accountability
In Wake of Sigachi Blast: Citizen Rights, Safety & Corporate Duty The devastating reactor...
By Citizen Rights Council 2025-07-01 05:55:28 0 2K
Delhi - NCR
Delhi-NCR Drives Economic Growth and Investment in 2026
Delhi-NCR continues to strengthen its position as one of India's leading economic hubs through...
By Fathima Safa 2026-07-02 06:21:49 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com