ఆసిఫాబాద్‌కు ఏం చేశారో చూపించండి. అధికార పక్షానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి బహిరంగ సవాల్

0
239

🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్  ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మూడేళ్లుగా కేవలం శంకుస్థాపనల నాటకాలే తప్ప క్షేత్రస్థాయిలో ఒక్క అభివృద్ధి పని కూడా ప్రారంభం కాలేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నియోజకవర్గంలో ఏం పనులు పూర్తి చేశారో చూపించాలని సవాల్ విసిరారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేను మంత్రి, నాయకులు ఇంతగా చులకన చేసి మాట్లాడటం తగదని హెచ్చరించిన ఆమె, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అవకాశం ఇస్తేనే పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన సదరు మంత్రి, ఆ రోజు గొప్పోడిగా కనిపించిన కేసీఆర్ గారు ఈ రోజు ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ అయిందని చెబుతున్న అధికార పక్షం, మరి మంత్రులంతా ఏ విధంగా విలాసాలు అనుభవిస్తున్నారని, మూసీ ప్రక్షాళనకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. నియోజకవర్గ పరిధిలో 3,500 ఇళ్లలో ఎక్కడ ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయో చూపించాలని సవాల్ విసిరిన ఆమె, కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్మాన్ పథకం నిధులతో కడుతున్న ఇళ్లను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినట్లు ఇక్కడి స్థానిక నాయకులు చెప్పుకోవడం సమంజసం కాదని తప్పుబట్టారు. వట్టివాగు ప్రాజెక్టు నిండినా నీళ్లు విడుదల చేయకపోవడంపై రైతులను ఏకం చేసి నిన్న హైవే రోడ్డుపై భారీధర్నా నిర్వహించామని, రెండు రోజుల్లో నీరు వదులుతామని అధికారులు హామీ ఇవ్వడంతోనే ధర్నా విరమించామని తెలిపారు. అయితే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా స్థానిక సమస్యలపై తాను చేసిన సుదీర్ఘ పోరాటాన్ని, రైతుల పక్షాన చేపట్టిన ఆందోళనలను పూర్తిగా పక్కనపెట్టి, కేవలం కాంగ్రెస్ నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చారు కాబట్టే ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నామంటూ మంత్రి గారు బాధ్యతారహితంగా మాట్లాడటం ఒక ఎమ్మెల్యేను మరియు ప్రజాస్వామ్య విలువలను ఘోరంగా అవమానించడమేనని తీవ్రంగా మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు కట్టలేదనే నిజాన్ని ఒప్పుకుంటున్నామని, కానీ కేసీఆర్ గారు అందించిన రైతు బీమా, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ప్రజలను కంటికి రెప్పలా ఆదుకున్నామని గుర్తుచేశారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నానని ఇబ్బందులు సృష్టించాలని చూస్తే ఎవరి తరం కాదని, నియోజకవర్గ ప్రజలంతా తన వెంటే ఉన్నారని కోవ లక్ష్మి తేల్చిచెప్పారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాదు చంద్రనగర్ లో బంగారం చోరీ
నిజామాబాదు చంద్రనగర్ లో ఒక షాప్ కి విక్స్ కావాలి అంటూ వచ్చి బంగారం చోరీ చేసాడు ... ఈ చోరీ సి.సీ...
By Sunka Santhosh 2026-04-04 18:50:09 0 341
Telangana
పెద్దపల్లి : ప్రైవేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి... ఎస్ఎఫ్ఐ
పెద్దపల్లి జిల్లాలో ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు...
By Sunka Santhosh 2026-06-16 19:43:04 0 129
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
*విజయవాడ నగరపాలక సంస్థ*   *వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి*   *విజయవాడ నగరపాలక...
By Rajini Kumari 2025-12-30 10:37:21 0 400
Andhra Pradesh
వీబీ.జీ.రామ్.జీ ఏప్రిల్ లో ‌మర్చి నెలాఖరు వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం రాష్ట్ర లకు కేంద్రం స్పష్టత.
ఈఏడాది మార్చి వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం అమలు చేయానున్నారు ఏప్రిల్ నుంచి ప్రారంభమైయ్యే...
By Karapati Gopi 2026-01-03 01:08:43 0 828
Telangana
🌧️ గత 3 రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు – నగరం జలమయంగా మారింది
హైదరాబాద్‌ - గత మూడు రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నిరంతర...
By BMA ADMIN 2025-08-16 07:08:53 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com