ఆసిఫాబాద్ హైవే దిగ్బంధం. వట్టివాగు నీటి కోసం రైతులతో కలిసి బైఠాయించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

0
211

 🎤(భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ (బురుగుడ): వట్టివాగు ప్రాజెక్టు కాలువలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ జాతీయ రహదారిపై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు స్వయంగా హాజరై, రైతులకు మద్దతుగా వారితో కలిసి జాతీయ రహదారిపైనే బైఠాయించి ధర్నాకు కూర్చున్నారు.ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ అధికారులు కాలువలకు విడుదల చేయడం లేదని, నీరు అందక తాము వేసిన వరి నాట్లు ప్రారంభ దశలోనే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, వందలాది మంది రైతులు హైవేని దిగ్బంధించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వట్టివాగు నీటిని విడుదల చేయాలని, అప్పటివరకు ఆందోళన విరమించేది లేదని ఎమ్మెల్యే, మరియు రైతులు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
: పెద్దలకు భరోసా - ఒంటరి వృద్ధులకు AP పోలీస్ తోడుగా
 ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్ల రక్షణ కోసం AP పోలీస్ "పెద్దలకు భరోసా" ప్రత్యేక కార్యక్రమం...
By Kalaga Sailaja 2026-07-01 09:24:43 0 189
Andhra Pradesh
ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ
ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి...
By Boiena Rajesh 2026-04-15 12:51:19 0 206
Telangana
నిజామాబాద్
ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ వీధి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని...
By Sadaq Sadaq 2026-07-19 09:30:45 0 128
Andhra Pradesh
చింతూరు: సీలేరు నదిలో స్నానానికి దిగి వ్యక్తి ప్రమాద వశత్తు మృతి!
పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు కాలనీ సమీపంలోని పిక్‌నిక్ స్పాట్ వద్ద విషాద ఘటన...
By Shyamala Yadagiri 2026-06-06 10:21:16 0 236
SURAKSHA
Saswata Mishra IAS: Driving Odisha's Visionary Governance
A distinguished 1996-batch IAS officer of the Odisha Cadre, Saswata Mishra has emerged as one of...
By Lokeshwari Panthadi 2026-07-27 05:38:07 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com