నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ ధ్వజమెత్తారు

0
216

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్):తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ విమర్శించారు. ఆసిఫాబాద్‌లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 17 రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ రెండున్నరేళ్ల పాలనలో కేవలం 60,000 ఉద్యోగాలకే పరిమితమై, లక్షలాది ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.రాష్ట్రంలో లక్షలాది మంది యువత డీఎస్సీ (DSC), గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని రమేష్ పేర్కొన్నారు. పోలీస్ శాఖలో 21,000 ఖాళీలు ఉన్నట్లు డీజీపీ లెక్కలు చెబితే, ప్రభుత్వం కేవలం 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. ఆసిఫాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతాల యువత కోసం తక్షణమే అన్ని ఖాళీలకు పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేనిపక్షంలో నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని కోటా రమేష్ హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: అంజలి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు: డిఎస్పి.
ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు...
By Pagadala Venkateswar 2026-02-21 04:18:07 0 203
Andhra Pradesh
ముగతి గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం
నందవరం మండల కేంద్రం ముగతి గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం...
By Boya Dasthagiri 2026-04-22 11:05:29 0 208
SURAKSHA
ఉన్న రోగుల కోసం తెలంగాణ పోలీసుల రక్తదాన శిబిరాలు
తెలంగాణ పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, మానవీయ కోణంలో అనేక సేవా...
By Kalaga Sailaja 2026-07-01 07:48:43 0 180
Andhra Pradesh
బాపట్ల జిల్లా పోలీసులు సముద్రతీరా ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్ 
బాపట్ల జిల్లా పోలీసులు సముద్రతీరా ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్    చీరాల: బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-17 16:36:56 0 234
Telangana
కాలనీ సమస్యలను తొలగించే దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్134 (ఓల్డ్) డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-12-19 08:29:30 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com