పైలట్ కావాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏపీలోనే శిక్షణ!

0
88

 

పైలట్ కావాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏపీలోనే శిక్షణ!

13-08-2026 Thu 10:08

Andhra

Good news for aspiring pilots training now in Andhra Pradesh

ఏపీలో కొత్తగా ఆరు పైలట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు 

కర్నూలు, కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో ఈ కేంద్రాల నిర్మాణం

ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో డీజీసీఏ అనుమతితో పైలట్లకు శిక్షణ

ఒక్కో కేంద్రంలో 30 నుంచి 40 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు

నాగార్జున సాగర్ వద్ద కూడా మరో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక

ఏపీ ఏవియేషన్ రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో పైలట్ శిక్షణ కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త అందిస్తూ, ప్రభుత్వం కొత్తగా ఆరు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌టీవో) ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో అందుబాటులో లేని ఈ సౌకర్యం కర్నూలు, కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాల వేదికగా ప్రారంభం కానుంది. ఈ కేంద్రాల రాకతో ఏపీ ఏవియేషన్ శిక్షణలో ఒక ముఖ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది.

 

మొత్తం మూడు విమానాశ్రయాల్లో ఆరు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏపీఏడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ) నిర్వహణలో ఉన్న కర్నూలు విమానాశ్రయంలో రెండు ఎఫ్‌టీవోలు రానున్నాయి. వీటిలో మొదటి కేంద్రాన్ని ఈ నెల 22న ప్రారంభించనుండగా, మరొకటి డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది. 

 

ఇక, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలోని రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో రెండేసి చొప్పున కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. రాజమహేంద్రవరంలో టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. కడపలో ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ మొదలైంది. తిరుపతి విమానాశ్రయంలో కూడా ఎఫ్‌టీవోల ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపం
*స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో లోపం* గడ్డర్లు తొలగించి తిరిగి నిర్మాణం *పనులు ఆలస్యం అయ్యే అవకాశం*...
By Rajini Kumari 2026-05-15 11:52:07 0 174
SURAKSHA
Tamil Nadu Police: A Legacy of Technological Pioneering
The Tamil Nadu Police proudly upholds a storied legacy as a trailblazer in Indian law enforcement...
By Lokeshwari Panthadi 2026-07-03 08:58:42 0 104
Andhra Pradesh
రాష్ట్ర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడ్చిన 20 25 సంవత్సరంలో కోటైన ప్రభుత్వం పాలన...
By John Baji 2026-01-01 02:58:16 0 365
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాద్ సారధ్యంలో ఎస్ హెచ్ జి మహిళలకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ అభివృద్ధి కార్యక్రమం
*విజ‌య‌వాడ* *27-01-2026*   *స్క్రోలింగ్ పాయింట్స్*   *ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-01-27 11:49:44 0 220
Andhra Pradesh
కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలి.
విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డా. కె....
By Pagadala Venkateswar 2026-06-05 07:17:45 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com