క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. మండిపల్లి

0
179

 

 

రాయచోటి, ఆగస్టు 11:

 

అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను రాయచోటి నియోజకవర్గం టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మంగళవారం రాయచోటిలో ఘనంగా ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిలోని ప్రతిభను గుర్తించి సరైన శిక్షణ, మెరుగైన క్రీడా మౌలిక వసతులు, అవసరమైన ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయాలు సాధించగలరని అన్నారు.

 

అమరావతి ఛాంపియన్‌షిప్–2026 ద్వారా గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి ఉన్నత స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు ఒక మంచి వేదిక ఏర్పడిందని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ముందుకు సాగాలని సూచించారు.

 

అన్నమయ్య జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.

 

క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యకరమైన జీవన విధానం పెంపొందుతాయని డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. యువత ఎక్కువ సంఖ్యలో క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (DSDO) శ్రీ జి. చంద్రశేఖర్ గారు, రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జి PD శ్రీ కె. వీరాంజనేయులు గారు, PD శ్రీ నర్సరాజు గారు మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బందిని డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు అభినందించారు.

 

క్రీడాకారులకు అవసరమైన క్రీడా సామగ్రి, మైదానాలు, తాగునీరు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేయడం అభినందనీయమని అన్నారు.

 

అన్నమయ్య జిల్లా నుంచి భవిష్యత్‌లో మరింత మంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వచ్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
SURAKSHA
Architect of Governance: The Exemplary Journey of Vineet Garg, IAS
A Visionary Leader Reshaping Public Service in Haryana: In the complex machinery of Indian...
By Kalaga Sailaja 2026-07-17 08:23:53 0 117
SURAKSHA
Harish Kumar Gupta IPS | Commitment To Serve Nation With Pride
Harish Kumar Gupta IPS: The Steadfast Guardian Leading Andhra Pradesh Police with Integrity and...
By Kalaga Sailaja 2026-07-13 05:42:48 0 288
Andhra Pradesh
ఉద్యోగులకు 7358 కోట్ల పెండింగ్ బిల్లు విడుదల గ్రీన్ సిగ్నల్
*Press Release*   *ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్*...
By Rajini Kumari 2026-04-02 16:46:33 0 471
SURAKSHA
S. Suresh IPS: A Distinguished Police Leader Dedicated to Justice
"A police officer's greatest strength is the trust of the people and the courage to uphold the...
By Fathima Safa 2026-07-08 10:21:20 0 220
Andhra Pradesh
పుంగనూరులో సమస్యలు చెబుదామంటే అధికారులు కరువు కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి...
By Kothuru Murali 2026-05-27 14:58:42 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com