పోలీస్ స్టేషన్లో ప్రమాదం సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు

0
628

 

మహబూబాబాద్ : ​మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.​ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలిచే పోలీసుల జీవితాలు ఎంతటి ప్రమాదాల నడుమ సాగుతున్నాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయాందోళనల మధ్య, ప్రాణాలను పణంగా పెట్టి డ్యూటీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరిపెడ పెద్ద మున్సిపాలిటీగా మారడం, సర్కిల్ ఆఫీస్‌తో పాటు ఫస్ట్, సెకండ్ ఎస్సైలు కూడా ఇక్కడే విధులు నిర్వర్తిస్తుండటంతో సిబ్బంది సంఖ్యకు తగ్గట్టుగా సౌకర్యాలు లేవు. వర్షం వస్తే కారే కప్పులు, ఏ క్షణంలో ఊడిపడతాయో తెలియని పెచ్చుల కింద కూర్చొని రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేస్తున్నారు.​ఈ పరిస్థితిని గమనించి పక్కనే అన్ని ఆధునిక సౌకర్యాలతో కొత్త, పెద్ద పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారు. రేపో మాపో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఈ కొత్త భవనంలోకి మారే సమయం దగ్గరపడిన వేళ, ఈ లోపే ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం కలచివేస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే కంప్యూటర్ల ముందు పని చేసే సిబ్బంది జైల్ భరో సందర్భంగా అదనపు భద్రత నిమిత్తం బయటకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది ఇక ఆలస్యం చేయకుండా, మరో ప్రమాదం జరగకముందే తక్షణమే సిబ్బందిని కొత్త పోలీస్ స్టేషన్‌లోకి మార్చాలని, సురక్షితమైన వాతావరణంలో వారు విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Chandrashekar Badugu IAS: Inspiring Public Leadership
A Committed Telangana IAS Officer Driving Inclusive Growth, Transparent Governance, and...
By Lokeshwari Panthadi 2026-07-14 11:14:51 0 282
Telangana
పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ వద్ద BRS నేతల నిరసన..!
రమణ పోలీస్ కమిషనరేట్ వద్ద మంథని BRS నేతల పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ముత్తారంలో ఓ వ్యక్తి...
By Sunka Santhosh 2026-06-09 18:32:19 0 142
Andhra Pradesh
పుంగనూరు: జనసేన సభ్యత్వం కుటుంబానికి భరోసా: ఎన్. వి. ఆర్
పుంగనూరు మండలం, చదళ్ల గ్రామంలో జనసేన పార్టీ నేత వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం...
By Kothuru Murali 2026-02-25 09:47:49 0 183
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి
ఈరోజు అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు...
By Benguluri Madhubabu 2026-02-10 11:21:45 0 320
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com