పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ప్రతిష్టాపన

1
703

ఉద్రిక్తతల నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ

 

» గద్దె నిర్మించి పెద్ది విగ్రహాన్ని ఆవిష్కరించిన బిఆర్ఎస్ నాయకులు

 

భారత్ అవాజ్ న్యూస్:  వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకంగా ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. ప్రజా సేవ చేసిన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గద్దెను నిర్మించామని బీఆర్ఎన్ నాయకులు తెలిపారు. అయితే విగ్రహ ఆవిష్కరణకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తంతో గద్దెను కూల్చివేయడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ఆవిష్కరణను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, చివరకు గద్దెను పునర్నిర్మించి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. అనంతరం వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కొబ్బరికాయ కొట్టి, పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సేవ చేసిన నాయకుల స్మారకాలను గౌరవించడం ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగమని అన్నారు. స్మారక చిహ్నాల విషయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి, గుగులోతు రామస్వామి నాయక్, లెక్కల విద్యాసాగర్ రెడ్డి, గోనె యువరాజ్, మండల శ్రీనివాస్, గట్టిక అజయ్, వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, నాడెం శాంతికుమార్, పులిగిల్ల యాదగిరి, దార్ల రమాదేవి, నాగిశెట్టి ప్రసాద్, రావుల సతీష్, అప్పాల సుదర్శన్, పెరుమాండ్ల రవి, దోనాల రవి, రాయరాకుల సారంగంతో పాటు పట్టణ, మండల ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Kerala
Thiruvananthapuram: Prime Minister Narendra Modi inaugurated the Vizhinjam International Seaport
Thiruvananthapuram: Prime Minister Narendra Modi on Friday inaugurated the Vizhinjam...
By BMA ADMIN 2025-05-20 05:01:14 0 3K
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:30:54 0 79
Andhra Pradesh
శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.
  శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు. Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-04-30 04:56:37 0 141
Andhra Pradesh
దండుబాటులో వ్యర్ధాలను తొలగించాలి: షేక్ జిలాని 
చీరాల: చీరాల పట్టణంలోని  దండుబాటు ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని...
By Gadiyapudi Narendra 2026-01-20 12:03:59 0 243
Andhra Pradesh
పుంగనూరు ఏప్రిల్ 11 నుంచి రామచంద్ర యాదవ్ ధర్మదీక్ష
బీసీల న్యాయమైన హక్కుల సాధనకై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ...
By Kothuru Murali 2026-04-03 09:24:36 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com