డీజీపీ వార్నింగ్.. ఆ నలుగురిలో వణుకు స్టార్టింగ్.|

0
156

● వీడియో కాన్ఫరెన్స్‌లో పద్ధతి మార్చుకోవాలని సూచన

● మార్పు కనిపించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టీకరణ

● నలుగురి వివరాలపై అధికారికంగా వెల్లడి కాని వైనం

హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ శాఖలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

కొందరు అధికారుల పనితీరు, వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో నలుగురు అధికారులకు తమ పద్ధతిని మార్చుకోవాలని గతంలోనే సూచించినట్లు తెలిసింది.

అయితే ఆ సూచనల అనంతరం కూడా వారి వ్యవహారశైలిలో ఆశించిన మార్పు కనిపించలేదని సమాచారం. 

దీంతో ఇకపై ఇదే పరిస్థితి కొనసాగితే శాఖాపరమైన చర్యలు తప్పవని సీవీ ఆనంద్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంతో పోలీస్ శాఖలో తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా డీజీపీ ప్రస్తావించిన ఆ నలుగురు అధికారులు ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వారి పేర్లు, హోదాలకు సంబంధించి పలు రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు.

దీంతో నిర్ధారణ లేని సమాచారానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఇప్పటికే సూచనలు అందుకున్నప్పటికీ పనితీరు, వ్యవహారశైలిలో మార్పు రాకపోతే క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకునే విషయంలో డీజీపీ సీవీ ఆనంద్ కఠినంగా వ్యవహరించనున్నారనే సంకేతాలు వెలువడ్డాయి.

ఇక సంబంధిత అధికారులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? డీజీపీ ప్రస్తావించిన ఆ నలుగురు ఎవరు? అన్నది ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉత్కంఠ రేపుతున్న అంశంగా మారింది.

Sidhumaroju✍️

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:14:05 0 257
Goa
Goa Mining Policy and Iron Ore Operations Gain Momentum
Goa's mining sector continues to witness significant policy developments in 2026 as the state...
By Fathima Safa 2026-07-04 06:14:21 0 152
Maharashtra
Maharashtra Advances Renewable Energy Growth in 2026
Maharashtra continues to expand its renewable energy capacity through large-scale solar, wind,...
By Fathima Safa 2026-07-06 08:23:27 0 160
Andhra Pradesh
పుంగనూరునియోజకవర్గం : ఉజ్వల్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, బూరగమంద సచివాలయంలో ఎమ్మార్వో ప్రమీల ఆధ్వర్యంలో పిఎం...
By Kothuru Murali 2026-02-12 14:10:06 0 187
Telangana
ఆసిఫాబాద్ నూతన DMHOగా డాక్టర్ నాగేంద్ర నియామకం
🎤ఆసిఫాబాద్ (భరత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య...
By Chunarkar Jagadeesh 2026-08-06 04:05:16 0 394
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com