మాదిగలను కించపరిస్తే ఊరుకోం కాంగ్రెస్ నేతపై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నేతల తీవ్ర ఆగ్రహం

0
247

🎤భారత్ ఆవాజ్ న్యూస్ - ఆసిఫాబాద్: మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా అని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలను వివక్ష చూపుతూ, కించపరిచేలా మాట్లాడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మాజీ ఏఎంసీ చైర్మన్ గాధవేని మల్లేష్‌ను పార్టీ నుండి తక్షణమే బహిష్కరించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్పీ నేతలు డిమాండ్ చేశారు.సామాజిక మాధ్యమాల్లో మల్లేష్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ వైరల్ కావడంతో ఆగ్రహించిన నిరసనకారులు జిల్లా కేంద్రంలో ఉధృత నిరసన చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, మల్లేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ నేతలు స్థానిక (C.I) కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ పదవులకు మాదిగలు పనికిరారా అని ప్రశ్నిస్తూ, ఇప్పటివరకు తమ సామాజికవర్గానికి పార్టీలో ఎటువంటి పదవులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై వివక్ష చూపుతూ వ్యాఖ్యలు చేసిన ఆయనపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరించాలని, పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా పోలీసుల విజ్ఞప్తి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు జిల్లా...
By John Baji 2026-01-23 01:55:34 0 268
Telangana
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : సీపీ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాలు...
By Bonagiri RaviShankar 2026-08-01 03:42:30 0 219
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Agriculture and Farmer Welfare
Madhya Pradesh continues to prioritize agriculture and farmer welfare through initiatives aimed...
By Fathima Safa 2026-07-06 07:57:36 0 81
SURAKSHA
హైదరాబాద్: దేశంలోనే అత్యంత సురక్షితమైన డిజిటల్ నగరం
సాంకేతిక పురోగతితో పాటు సైబర్ భద్రతలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ స్టేట్...
By Kalaga Sailaja 2026-06-24 10:38:45 0 108
Telangana
సీవరేజ్ పనులు వేగవంతం చేయాలి.|
- లక్ష్మీనగర్‌లో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి - గడువులోగా...
By Sidhu Maroju 2026-07-19 07:26:57 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com